: టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు
టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మహానాడు వేదికపై ఏపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డిలు ప్రకటించారు. కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో పెద్దిరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. రాగ ద్వేషాలకు అతీతంగా... కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు.