: మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మబడును...ఆసక్తి ఉందా?


పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ అమ్మకానికి పెట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని నెవర్ లాండ్ రాంచ్ గా వెలుగొందిన 2,700 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఎస్టేట్ ఈ పాప్ గాయకుని మరణానంతరం నిరుపయోగంగా ఉండిపోయింది. ఆరు పడక గదుల ఇల్లు, 50 సీట్ల సామర్థ్యం గల సినిమా హాలు, ఓ రైల్వే స్టేషన్, పలు అతిథి గృహాలు, పలు క్రీడా ప్రాంగణాలు కలిగిన ఆ ఎస్టేట్ ను వంద మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కాగా, 2009లో మరణానికి ముందు మైఖేల్ జాక్సన్ తన పిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉండేవారు. అనంతరం ఆ ఎస్టేట్ లో జాక్సన్ ఆత్మ కనిపిస్తోందంటూ పుకార్లు పుట్టాయి. ఎస్టేట్ ధర తగ్గించేందుకు అలాంటి పుకార్లు రేపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News