: ఎప్పుడూ వాళ్లే నెగ్గుతారు: అమితాబ్


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మీడియాపై తన అభిప్రాయాలు వెల్లడించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మీడియా సమావేశాలకు హాజరైన ఆయన తన బ్లాగులో నిజాయతీగా పలు విషయాలు రాశారు. మీడియాను ఎప్పటికీ గెలవలేమని పేర్కొన్నారు. ఇప్పటికీ తనకు మీడియా సమావేశం అంటే కాస్తంత ఇబ్బందిగానే ఉంటుందని తెలిపారు. పాత్రికేయులు స్టార్లను మాటలతో గుచ్చుతారని, చిత్తు చేస్తారని అభిప్రాయపడ్డారు. ఫోర్త్ ఎస్టేట్ ను ఎదుర్కోవడం మామూలు విషయం కాదన్నారు. ఎప్పుడూ మీడియానే గెలుస్తుందని, పాత్రికేయులే నెగ్గుతారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News