: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నం
హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలోని హైదర్ నగర్ వద్ద ఉన్న ముత్తూట్ పైనాన్స్ లో దోపీడియత్నం జరిగింది. ఫైనాన్స్ కార్యాలయంలోకి వచ్చిన నలుగురు దుండగులు అందులోని సిబ్బందిని తుపాకి, కత్తులతో బెదిరించి దోపీడీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో సిబ్బంది పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలున్న స్ధానికులు వచ్చారు. ఈలోగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కార్యాలయంలోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ లను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు.