: సిద్ధిపేటలో దారుణం... ఉద్యోగమిస్తామని నమ్మించి యువతిపై అత్యాచారం


యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మెదక్ జిల్లా సిద్ధిపేటలో సంచలనం సృష్టించింది. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని దుబ్బాకకు చెందిన దంపతులు నమ్మబలికారు. ఆమెను సిద్ధిపేట తీసుకువచ్చి స్థానిక హరిహర రెసిడెన్సీలోని ఓ అపార్టుమెంటులో ఉంచారు. ఇంకా ఉద్యోగం దొరకలేదని, దానికోసం ప్రయత్నిస్తున్నామని మూడు రోజుల నుంచి చెబుతూ వచ్చారు. నిన్న ఆమెపై పదిమంది సామూహిక అత్యాచారం చేశారు. నేటి ఉదయం తప్పించుకువచ్చిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతిని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ఆ దంపతులు ప్రయత్నించి వుండవచ్చని భావిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News