: అంగ్ల పరిజ్ఞానంలో అమెరికన్ల పిల్లల కన్నా ఎన్నారైల సంతానమే మిన్న


ఇంగ్లిష్ భాషపై పట్టు, పరిజ్ఞానం విషయంలో అమెరికన్ల పిల్లలతో పోలిస్తే ప్రవాస భారతీయుల సంతానం ఓ మెట్టు పైనే ఉంది. ప్రతియేటా జరిపే 'స్పెల్ బీ' పోటీల ఫైనల్ లిస్టులను ప్రకటించగా, వారిలో ఎన్నారైల పిల్లల సంఖ్య అధికంగా ఉండటమే ఇందుకు కారణం. మొత్తం 49 మంది విద్యార్థినీ విద్యార్థులు ఫైనల్ పోటీలకు ఎంపిక కాగా, అందులో 25 మంది ఎన్నారైల సంతానమే! కాగా, గత ఎనిమిదేళ్లుగా ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన వారే విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలను ప్రముఖ టీవీ చానల్స్ లైవ్ ప్రసారాలు ఇస్తుండటం, అమెరికా వ్యాప్తంగా ఉన్న దినపత్రికలు చిన్నారులను స్పాన్సర్ చేసేందుకు పోటీ పడుతుండడం తదితర కారణాలతో స్పెల్ బీ పోటీలకు తమతమ చిన్నారులను సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపుతున్నారని 1985లో స్పెల్ బీ కిరీటాన్ని గెలుచుకున్న తొలి ఎన్నారై వారసుడిగా నిలిచిన బాలూ నటరాజన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News