: తెలుగుతేజానికి దక్కిన గౌరవం... రక్షణశాఖ సలహాదారుగా నియామకం


భారత రక్షణ మంత్రిత్వ శాఖలో కీలక పోస్టుకు ఓ తెలుగుతేజం ఎంపికయ్యారు. రక్షణశాఖ సలహాదారుగా సతీష్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సతీష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రయోగశాల, రీసెర్చ్ సెంటర్ డైరెక్టరుగా ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లా మామడోలు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. అగ్ని, పృధ్వి, ధనుష్, ఆకాష్, బ్రహ్మోస్, నిర్భయ వంటి క్షిపణులకు దిక్సూచీల రూపకల్పనలో సతీష్ రెడ్డిదే కీలక పాత్ర. లండన్ లోని రాయల్ ఫెలోషిప్, ఇండియాలో ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాలను ఆయన అందుకున్నారు.

  • Loading...

More Telugu News