: చైనా నుంచి బొమ్మలు, ఫోన్లే కాదు...ఆయుధాలు కూడా వస్తున్నాయి


చైనా సరకులు అంటే తక్కువ ధరకు వస్తాయని ప్రతీతి. దానిని నిజం చేస్తూ ఓ మోస్తరు పట్టణాల్లో పది రూపాయలకే వస్తువులు ఇస్తామని బోర్డులు పెట్టే చైనా షాపులు కనిపిస్తాయి. ఆటబొమ్మలు, మొబైల్ ఫోన్లు చైనా నుంచి తక్కువ ధరకు భారత్ కు స్మగుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు కూడా చైనా నుంచి స్మగుల్ అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారంతో నాగపూర్ లోని ఓ కిరణా షాప్ పై దాడి చేసిన పోలీసులు, అక్కడ దొరికిన మారణాయుధాలు చూసి అవాక్కయ్యారు. సుమారు 102 మారణాయుధాలు చైనా నుంచి భారత్ కు అక్రమంగా తరలించినవే కావడం విశేషం. మహ్మద్ నయీమ్ అబావుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఈ ఆయుధాలను చైనా నుంచి తెప్పించుకున్నాడు. పోలీసులు అతని నుంచి 102 ఆయుధాలు, 4.20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల విలువ 50 వేల రూపాయలని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News