: చైనా 'అధ్యక్షుడి'తో కామెడీయా?... ఫలితం ఇలానే ఉంటుంది!
చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ ఫొటోలను కామిక్ స్టయిల్లోకి మార్చి సోషల్ మీడియాలో పెట్టిన దాయ్ జియాన్ యంగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవ్వు పుట్టించే రీతిలో అధ్యక్షుడిని పలు కారికేచర్ తరహా ఫొటోల రూపంలో చిత్రించాడు. కొంతకాలంగా ఇతగాడు... మూతి వంకర, కళ్లు పెద్దవిగా... ఇలా జిన్ పింగ్ ను కొంత వికృతంగా, కొంత హాస్యస్ఫోరకంగా చిత్రించి, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయసాగాడు. ఒక్కోసారి తానే విచిత్రంగా పోజులిచ్చి, ఆ ఫొటోలనే సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకుంటాడట ఈ ఆర్టిస్టు. అయితే, అధ్యక్షుడి ఫొటోలతో ఆటలాడడంతో ప్రభుత్వ వర్గాలకు ఒళ్లు మండింది. ఆ కారికేచర్ తరహా ఫొటోలు ఇప్పుడు సూట్ కేసులపైనా, కూల్ డ్రింక్ క్యాన్లపైనా, టీ షర్టులపైనా దర్శనమిస్తున్నాయి. దీంతో, అధ్యక్షుడిని నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి సోషల్ మీడియాలో పెడతావా? అంటూ అతడిని అరెస్టు చేశారు.