: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నిరాకరించాలంటూ ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేశారు. అటు పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రెడ్యానాయక్, విఠల్ రెడ్డి, కనకయ్యలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నిరాకరించాలని సంపత్ కుమార్ కూడా పిటిషన్ వేశారు. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత, ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము కలగజేసుకోబోమని, స్పీకరే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.