: టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి చంద్రబాబు తరపున నామినేషన్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలైంది. చంద్రబాబు పేరును ప్రతిపాదిస్తూ ఆయన తరపున 6 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ పత్రాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యనేతలు, పోలిట్ బ్యూరో సభ్యులు సంతకం చేశారు. చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం కానుండగా, మహానాడులో దానిపై రేపు ప్రకటించనున్నారు.