: ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ పై మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనుక్షణం తపించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు.