: టీఆర్ఎస్ అభ్యర్ధుల ఖరారు తేదీ


రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులను వచ్చేనెల 15 తరువాత ప్రకటిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి తుది గడువు నిర్ణయించలేదని తెలిపారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేరని అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణాకు ఒక్క పైసా కూడా ఇవ్వనన్న సీఎం కిరణ్ కుమార్ కు ఒక్క ఓటు కూడా పడనీయమని కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News