: కాంగ్రెస్ నుంచి బీజేపీ దొంగిలించలేనిది అదొక్కటేనట!


ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలనకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు వేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు దాడుల తీవ్రత పెంచారు. సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ... బీజేపీ నాయకత్వంలోని సర్కారు తమ హయాంలోని అన్ని పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. తమ నుంచి దొంగిలించలేనిది ఏదైనా ఉందంటే అది తమ పార్టీ లోగోయేనని సెటైర్ వేశారు. యూపీఏ పథకాలకు పేర్లు మార్చి తమవేనని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. ఈయన కూడా సూటు బూటు సర్కారంటూ మోదీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News