: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రేపే
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నారు. జేఎన్టీయూలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 14న పరీక్షను నిర్వహించారు. ఇప్పటికే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయిన సంగతి తెలిసిందే. అంతేకాక, ఎంసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలని... రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు నిర్ణయించారు.