: 24 గంటల తర్వాత క్రమంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. మరో 24 గంటల తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, కోస్తా ప్రాంతంలో ఈ రోజు పలు చోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఉత్తర ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏదేమైనప్పటికీ, మరో రెండు రోజులు మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.