: ఇదే నా రెండు కళ్ల సిద్ధాంతం... మహానాడులో వివరించిన చంద్రబాబు


గండిపేటలో జరుగుతున్న మహానాడులో తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. వేదికపైన ఒకవైపు అందమైన కాకతీయుల కళాతోరణం ఏర్పాటు చేశారని, మరోవైపు నూతన రాజధాని అమరావతి స్థూపాన్ని ఏర్పాటు చేశారని, ఇదే తన రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పారు. ఇరు ప్రాంతాలను సమానంగా చూడటమే తన రెండు కళ్ల సిద్ధాంతమని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా... రెండు రాష్ట్రాలకు మేలు చేయాలని కోరతానే తప్ప, ఒక్క రాష్ట్రానికి మాత్రమే మేలు చేయాలని కోరనని తెలిపారు. గతంలో తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఇతర పార్టీల నేతలంతా విమర్శించారని... అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. అమరావతి పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తోందన్న చంద్రబాబు... రాజధాని నిర్మాణం మనకు ఒక ఛాలెంజ్ వంటిదని చెప్పారు. సింగపూర్ లాంటి దేశం మనకు మాస్టర్ ప్లాన్ ఇస్తోందని... తెలుగు జాతి గర్వించేలా రాజాధానిని నిర్మించి, అందరికీ చూపెడదామని తెలిపారు. రాజధానిపై కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారని... అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News