: లోకేష్ కు టీడీపీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు ఇవ్వాలి: కళా వెంకట్రావు
టీడీపీ మహానాడు నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో యువనేత నారా లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి. అటు పలువురు పార్టీ నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఏపీ టీడీపీ నేత కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ కు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ పదవీ బాధ్యతలు ఇవ్వాలన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కళా తెలిపారు.