: ఆర్.కె.నగర్ నుంచి జయలలిత పోటీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ అధికారం చేబట్టిన జయలలిత చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రి పదవి చేబట్టిన సంగతి విదితమే. ఆమె పోటీ చేయడానికి వీలుగా ఆర్.కె.నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ వారం క్రితమే రాజీనామా చేశారు. దీంతో ఆమె అదే నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఈ నియోజకవర్గంలో జూన్ 27న ఉపఎన్నిక జరుగనుంది.