: నాడు చంద్రబాబు అమలు చేసిందే నేడు మోదీ అమలు చేస్తున్నారు: అశోక్ గజపతిరాజు


కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తిరుపతిలో 'జన్ కల్యాణ్ పర్వ్' సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అప్పట్లో చంద్రబాబునాయుడు 'క్లీన్ అండ్ గ్రీన్' పేరిట పథకం అమలు చేశారని, ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఆ పథకాన్నే 'స్వచ్ఛ భారత్' పేరిట అమలు చేస్తున్నారని తెలిపారు. ఇక, జూన్, జూలై లోపే తిరుపతి విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News