: కుంభకోణం సంగతేమో కానీ... గన్స్ మాత్రం భేషుగ్గా ఉంటాయి: పారికర్


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పదవిలో ఉండగా జరిగిన బోఫోర్స్ ఒప్పందంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో, బోఫోర్స్ పై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తనదైన శైలిలో స్పందించారు. బోఫోర్స్ కుంభకోణం సంగతేమో తెలియదు కానీ, బోఫోర్స్ గన్స్ నాణ్యత విషయంలో భేషుగ్గా ఉంటాయని అన్నారు. స్వీడన్ కు చెందిన బోఫోర్స్ గన్స్ నాణ్యతలో వాటికవే సాటి అని ఆయన అభిప్రాయపడ్డారు. మరి దేశం మొత్తం బోఫోర్స్ కుంభకోణం అంటుండగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం అది కుంభకోణం కాదని అంటున్నారని అడుగగా, దానిపై వ్యాఖ్యానించేందుకు పారికర్ నిరాకరించారు. దానిపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు కానీ, బోఫోర్స్ గన్స్ మాత్రం అద్భుతమైనవని చెబుతానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News