: భారత్ ను ముంచెత్తనున్న సోనీ 'ఎక్స్ పీరియా జడ్3ప్లస్'
సోనీ 'ఎక్స్ పీరియా జడ్3ప్లస్' మొబైల్ ఫోన్స్ భారత మార్కెట్లోకి రానున్నాయి. 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా కలిగిన వాటర్ ప్రూఫ్ హ్యాండ్ సెట్ గా సోనీ దీనిని అభివర్ణిస్తోంది. 6.9 ఎంఎం మందంతో స్లీక్ ఫోన్ గా ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుందని సోనీ భావిస్తోంది. దీనికి ముందువైపు కెమేరా 5 మెగాపిక్సల్ ఉండడం విశేషం. 1080 రిజల్యూషన్ తో ఇది పని చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్ తో పని చేసే ఈ ఫోన్ టచ్ స్క్రీన్ సౌకర్యం కలిగినది కావడం విశేషం. 5.2 ఇంచుల డిస్ ప్లే దీని సొంతం. కాగా, ఇది నలుపు, తెలుపు, కాపర్ రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సోనీ, దీని ధరను మాత్రం వెల్లడించలేదు.