: మరోసారి నెత్తురోడిన కెన్యా


ఆఫ్రికా దేశం కెన్యా మరోసారి నెత్తురోడింది. పోలీసులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈశాన్య ప్రాంతంలోని గరిస్సా కౌంటీలో జరిగిన ఈ ఘటనలో 25 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ కాల్పులు జరిపింది తామేనని సోమాలియాకు చెందిన అల్-షబాబ్ అనే ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ప్రకటించుకుంది. గత కొంత కాలంగా ఈ సంస్థ కెన్యాలోకి చొరబడి దాడులకు పాల్పడుతోంది. గత నెలలో కూడా గరిస్సా యూనివర్శిటీపై దాడి చేసి 148 మంది ప్రాణాలను బలిగొంది.

  • Loading...

More Telugu News