: సిమీ ఉగ్రవాదులేనా?...నల్గొండ జిల్లాలో తుపాకులతో ఇద్దరు యువకులు


సిమీ ఉగ్రవాదులు, పోలీసుల మధ్య నల్గొండ జిల్లాలో జరిగిన పోలీసు కాల్పుల ఘటన మరువకముందే మరోసారి ఇద్దరు యువకులు తుపాకులతో కనిపించి కలకలం రేపారు. నకిరేకల్ లో అపాచీ ఎపీ 13 ఆర్ యూ 4379 నెంబర్ గల బైక్ పై తుపాకులతో సాయుధులైన ఇద్దరు యువకులు వచ్చి స్థానికులను బెదిరించి పరారయ్యారు. వారిద్దరూ హిందీలో మాట్లాడారని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు నిషేధిత సిమీ ఉగ్రవాదులేనా? అనే ఆందోళనలో ఉన్నారు. కాగా, సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News