: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: పోచారం
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. 'మన తెలంగాణ-మన వ్యవసాయం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు కృషి చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. తెలంగాణలో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయంలో నష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు.