: కర్ణాటకలో హుబ్లీ రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


కర్ణాటకలోని హుబ్లీ రైల్వే గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు టైరు పేలి అదుపుతప్పడంతో డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయినవారిని కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల పేర్లు... హుస్సేన్, సుభాన్, ఇస్మాయిల్, అమీర్, చలపలి అని తెలిపారు. కర్నూలు నుంచి గోవా వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసింది.

  • Loading...

More Telugu News