: గుడిలో గంటలు దొంగలిస్తూ అడ్డంగా దొరికిపోయాడు


'కాదేదీ చోరీకి అనర్హం' అన్నట్టు తయారైంది దొంగల పరిస్థితి. గుడిలోని నగలు, హుండీలోని డబ్బు కొట్టేసిన వార్తలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ, ఈ చోర శిఖామణి రూటు మార్చాడు. గుడికి వచ్చి, గంటలను కొట్టేయబోయాడు. ఈ ఘటన, హైదరాబాద్ తుకారాంగేట్ ప్రాంతంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. రాజు అనే దొంగ గంటలను తస్కరిస్తుండగా గమనించిన భక్తులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News