: డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయిన పాక్ క్రికెటర్... రెండేళ్ల నిషేధం
ఆడింది ఒకే ఒక వన్డే మ్యాచ్. మరో 10 టీ-20లు ఆడిన అనుభవముంది. అయితేనేం, బుద్ధి వక్రమార్గం పట్టింది. ఫిట్ నెస్ కోసం నిషేధిత డ్రగ్స్ తీసుకున్నాడు. డోపింగ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయాడు. ఇదంతా పాకిస్థాన్ స్పిన్ బౌలర్ రజా హసన్ ఉదంతం. ఓ దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా జరిపిన డోపింగ్ టెస్ట్ లో ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ పట్టుబడ్డాడు. దీంతో, రజా హసన్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో దుబాయిలో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన రజా, చివరగా గత సంవత్సరం డిసెంబరులో న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో పాల్గొన్నాడు.