: చైనా భూకంపంలో విగతజీవులు 193


సిచువాన్ ప్రాంతంలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 193కు చేరుకుంది. ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పలువురి ఆచూకీ లేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదని, శిధిలాల కింద ఇంకా కొంత మంది ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ 193 మంది మరణించారని, పదివేల మందికి పైగా గాయపడ్డారని సిచువాన్ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News