: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం ... 38 మంది సజీవ దహనం


చైనాలో ఘోర దుర్ఘటన జరిగింది. ఓ వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో గత రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పింగ్ దింగ్ షాన్ అనే పట్టణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనంలోని అపార్టుమెంటులో కాంగ్లెయువాన్ పేరిట ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. ఇందులో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని అగ్నిమాపక దళం చేరుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News