: ఈజిప్టులో సైన్యంతో తిరుగుబాటుదారుల పోరు
రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈజిప్టులో సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పదిమంది పౌరులతోపాటు ఒక జవాను, మరో ప్రభుత్వాధికారి మృతి చెందారు. దేశంలోని ఉత్తర సినాయ్ సమీపంలోని షేక్ జ్వాయిడ్ పట్టణంలో తాజా గొడవలు చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, రఫా నగరంలోని ఓ ఆర్మీ క్యాంపు మీద క్షిపణులతో తిరుగుబాటుదారులు దాడులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏ మేరకు నష్టం జరిగిందన్న వివరాలు వెల్లడి కాలేదు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సాయుధ బలగాలను పెంచినట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.