: అయ్యబాబోయ్!... 100 మెగా పిక్సల్ కెమేరాతో జియోనీ స్మార్ట్ ఫోన్


గతంలో నోకియా 41 మెగా పిక్సల్ కెమెరాను విడుదల చేసి స్మార్ట్ ఫోన్ మొబైల్ ఇండస్ట్రీని అచ్చెరువొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చైనా సంస్థ జియోనీ ఏకంగా 100 మెగా పిక్సల్ కెమేరాతో స్మార్ట్ ఫోన్ ను తయారు చేసిందట. దీన్ని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నామని తెలిపింది. ఇక ఎక్కువ రెజల్యూషన్ ఫొటోల కోసం డీఎస్ఎల్ఆర్ కెమేరాల వైపు మొగ్గు చూపే కాలం పోతుందేమో! కాగా, ఈ ఫోన్లో మరింత వేగవంతమైన ప్రాసెసర్, నాణ్యమైన చిత్రాల కోసం అత్యాధునిక లెన్స్, 16 గిగాబైట్ల మెమొరీ సామర్థ్యం, 3జి వంటి సదుపాయాలెన్నో ఉన్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News