: ఐపీఎల్ విండీస్ స్టార్లపై ఆశలు పెట్టుకున్న కొత్త కోచ్
విండీస్ సెలక్టర్లతో రేగిన విభేదాల కారణంగా పలువురు ఆటగాళ్లు క్రికెట్ బోర్డుతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. వివిధ కారణాలు చెబుతూ జాతీయ జట్టుకు ఆడేందుకు డుమ్మా కొడుతున్నారు. ఐపీఎల్ కు ప్రాధాన్యతనిస్తూ జాతీయ జట్టును నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పలువురు క్రికెటర్లపై సెలక్టర్లు వరల్డ్ కప్ సందర్భంగా వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ నాటి వివాదం కారణంగా లెండిల్ సిమ్మన్స్, డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పొలార్డ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఆండ్రీ రస్సెల్ ఫిట్ గా లేనంటూ విండీస్ బోర్డుకు చెప్పి తప్పించుకున్నాడు. సునీల్ నరైన్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరు మళ్లీ విండీస్ జాతీయ జట్టులో ఆడుతారా? అనేది అనుమానాస్పదమే. వీరంతా జాతీయజట్టుకు ఆడాలనేది విండీస్ అభిమానుల అభిప్రాయమని వెస్టిండీస్ కొత్త కోచ్ ఫిల్ సిమ్మన్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ విండీస్ స్టార్లపై ఈయన గంపెడాశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది