: మాస్టర్ ప్లాన్ రూపొందించుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా?: వాసిరెడ్డి పద్మ


వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను విదేశీ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. మాస్టర్ ప్లాన్ ను తయారుచేసుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు పరిపాలన కూడా జపాన్, సింగపూర్ లకు అప్పగిస్తే బాగుంటుదని ఎద్దేవా చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడివారితో మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిందని హితవు పలికారు. ఇది నిజంగా తెలుగు ప్రజలకు దుర్దినమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News