: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షునిగా ఎమ్మెల్యే మాగంటి


గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేరు ఖరారైంది. ఈ మేరకు నేడు సమావేశమైన పార్టీ నేతలు గోపీనాథ్ పేరును నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, పార్టీకి తాను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకునే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా నియమించారని అన్నారు. మరోవైపు నగర అధ్యక్షుడిగా ఆంధ్రా నేత మాగంటి నియామకంపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News