: 9 రోజుల్లో 217 మందిని ఉరేసి చంపిన ఉగ్రవాదులు


ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒడిగట్టిన మరో ఘోర దారుణం వెలుగులోకి వచ్చింది. గడిచిన తొమ్మిది రోజుల్లో 217 మందిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జాలీ, దయా లేకుండా ఉరితీసి చంపారని సిరియా హక్కుల సంస్థ వెల్లడించింది. వీరంతా అకారణంగా ప్రాణాలు కోల్పోయిన వారేనని, మృతుల్లో అమాయకులైన ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వివరించింది. మే 16 నుంచి ఈ దమనకాండను సిరియా పురాతన నగరం పాల్మిరాలో సాగించారని తెలియజేసింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో సామాన్య పౌరులు, చిన్నారులు కలిపి 67 మంది, సైన్యం, ప్రభుత్వ బలగాలకు చెందిన 150 మంది, 12 మంది మహిళలు ఉన్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News