: కడప జిల్లా పేరు నుంచి 'వైఎస్ఆర్' పేరును తొలగిస్తాం: సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్య


కడప జిల్లా పేరు 'వైఎస్ఆర్ కడప' అని ఉండడం ప్రజలకు ఇష్టం లేదని, జిల్లాకు కడప పేరునే శాశ్వతం చేస్తామని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్‌ పేర్కొన్నారు. కడపలో జరిగిన మినీ మహానాడులో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాస్ తో కలసి పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, కడప అభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని అన్నారు. కడపలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే వారిని వైకాపా నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా ప్రజలను పట్టించుకోని జగన్, ఇతర జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా కడపను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని సీఎం రమేష్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News