: చైనాలో కూడా 'పీకే' రికార్డులే
'పీకే' సినిమా చైనాలో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతోంది. చైనీస్ లాంగ్వేజ్ లోకి డబ్ అయి, చైనా వ్యాప్తంగా 4,600 ధియేటర్లలో రిలీజైన 'పీకే' 28.1 (178.34 కోట్ల రూపాయల) కలెక్షన్లు సాధించింది. భారతీయ సినిమా చైనా భాషలో విడుదలై రికార్డు వసూళ్లు సాధించిన తొలి సినిమాగా 'పీకే' నిలవడం విశేషం. కాగా, ఈ సినిమా ప్రమోషన్ లో అమీర్ మాట్లాడుతూ, విద్య, మానవీయ విలువల నేపథ్యంలో రూపొందిన సినిమాలను చైనీయులు ఆదిరిస్తారని అన్నారు. గతంలో '3 ఇడియట్స్'ను ఆదరించిన చైనీయులు మరోసారి అమీర్ 'పీకే'ను ఆదరించడం విశేషం.