: అఫ్జల్ గురును రాజకీయ లబ్ధి కోసమే ఉరితీశారు: ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు


అఫ్జల్ గురు ఉరితీతపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే అఫ్జల్ గురును ఉరితీశారని ఆయన తెలిపారు. అఫ్జల్ గురును ఉరితీసేముందు రాత్రి అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఫోన్ చేసి, తెల్లవారు జామున అఫ్జల్ గురును ఉరి తీస్తున్నామని, జమ్మూకాశ్మీర్ లో అల్లర్లు తలెత్తకుండా శాంతి భద్రతలు పరిరక్షించుకోవాలని తనకు సూచించారని అన్నారు. ఉరి తప్ప వేరే దారి లేదా? అని తాను ప్రశ్నించానని, దానికి ఆయన సంతకాలన్నీ పూర్తయ్యాయని, తన చేతుల్లో ఏమీ లేదని అన్నారని ఆయన చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ఇతర పక్షాలను ఎదుర్కొనేందుకే అఫ్జల్ గురును ఉరితీశారని ఆయన ఆరోపించారు. కాగా, పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు 28వ నిందితుడు.

  • Loading...

More Telugu News