: 300 కోట్లతో మత్స్య యూనివర్సిటీ నిర్మిస్తాం: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లో 300 కోట్ల రూపాయలతో మత్స్య యూనివర్సిటీ నిర్మిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో ఉద్యాన, మత్స్య, డెయిరీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాజధాని ప్రాంత ప్రజలను కొందరు పనిగట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జూన్ 6న భూమి పూజ చేస్తామని ఆయన చెప్పారు. దసరా నాటికి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆయన వివరించారు. రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31 వరకు పొడిగించామని ఆయన చెప్పారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన చోటే జూన్ 8న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.