: నిరుద్యోగ భృతిపై నోరు మెదపని చంద్రబాబు: జగన్ ధ్వజం
ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిని అందిస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు, ఇప్పుడా మాటే ఎత్తడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీఎంను మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని అన్నారు. ఆయన వాగ్దానాలన్నీ బూటకమని ప్రజలకు తెలిసివచ్చిందని అన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని ఈ ఉదయం జగన్ పరామర్శించారు. గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి పరిహారం అందలేదని, తాను పరామర్శకు వెళుతున్నానని తెలిసి హడావుడిగా నామమాత్రం సాయం చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన నిప్పులు చెరిగారు.