: సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు: అంబటి


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన తొలి సంతకాల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలు కాలేదని ఆరోపించారు. చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా అబద్ధాలు చెబుతూ చంద్రబాబు కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. జూన్ 2న 'నవ నిర్మాణ దీక్ష'ను ఉత్సవ దినంగా కాకుండా నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రచారానికి పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు... రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు.

  • Loading...

More Telugu News