: జయలలితకు కేంద్ర మంత్రి జైట్లీ అభినందనలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ పగ్గాలు చేట్టిన జయలలితకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారు. "ఏఐఏడీఎంకేతో మాకెలాంటి పొత్తు లేదు. కొన్ని విషయాలపై మాత్రమే సహకరించుకుంటాం. కానీ మా మధ్య భేదాలు కూడా ఉన్నాయి. తమిళనాడుతో మేము (కేంద్రం) మంచి సంబంధాలు కొనసాగిస్తాం. వారికి సహకరిస్తాం కూడా" అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైట్లీ పేర్కొన్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆయన మాట్లాడారు. బీహార్ లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్ ల పొత్తు అనైతికమని జైట్లీ వ్యాఖ్యానించారు.