: జట్టులో ఉండాలంటే సుఖపెట్టాల్సిందే... శ్రీలంక మహిళా క్రికెటర్లపై బోర్డు అధికారుల ఒత్తిళ్లు!
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపుల కలకలం రేగింది. జాతీయ జట్టులో ఉండాలంటే తమకు సెక్స్ సుఖం అందించాల్సిందేనని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయని దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ నిమల్ దిసనాయకే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఆరోపణలు నిజమని తేల్చింది. శ్రీలంక జాతీయ మహిళా జట్టులోని చాలామంది క్రికెటర్లు ఈ వేధింపుల బారినపడ్డారని కమిటీ పేర్కొంది. తప్పు చేసినవారిపై కఠినచర్యలు ఉంటాయని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.