: యూనిఫాంలో డ్యాన్సర్ తో చిందేసిన పోలీసులు


యూనిఫాంలో పోలీసులు ఎలాంటి చిల్లర కార్యక్రమాలకు పాల్పడకూడదు. విధులు నిర్వర్తించేటప్పుడు నిబద్ధతతో వ్యవహరించాలి అనే నిబంధనలు ఉన్నాయి. నిబంధనలను కాలరాసి పోలీసులు చిందేసిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. బరోడాలోని సహోద్యోగి కుమార్తె వివాహానికి యూనిఫాంలో హాజరైన పోలీసులు అందులో గానాబజానాలో చిందేశారు. అంతటితో ఆగలేదు, సినిమాల్లోలా డ్యాన్సర్ పైకి పచ్చనోట్లు విసిరి సంబరపడిపోయారు. దీనిని మీడియా ప్రతినిధి చిత్రీకరించడంతో అది వెలుగు చూసింది. ప్రధాని సొంత రాష్ట్రంలో పోలీసులు ఇలా ప్రవర్తించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News