: ఆ పెళ్లికి చట్టబద్ధత ఇవ్వాలా? వద్దా?: ఐర్లాండులో 'గే' వివాహాలపై రెఫరెండం!
ఐర్లాండ్ లో మరో రెఫరెండంకు తెరలేచింది. 'గే' (స్వలింగ సంపర్కులు) వివాహాలను చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే దానిపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. ఐర్లాండ్ లో రెఫరెండం సర్వసాధారణం. పలు విషయాలపై ప్రజల అభిప్రాయంతోనే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. 'ఎస్', 'నో' అనే ఆప్షన్లలో ప్రజలు తమ అభిప్రాయం రెఫరెండంలో తెలియజేస్తారు. ఎక్కువ ఓట్లు దేనికి వస్తే, దానిని అమలు చేస్తారు. ఐర్లాండ్ కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది వరకు 'గే' వివాహాలపై రెఫరెండం నిర్వహిస్తున్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం 'గే' వివాహాలకు చట్టబద్ధత లభిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి 'లెస్బియన్లు', 'గే' వివాహాలకు చట్టబద్ధత కల్పించడంలో విదేశాలు పోటీ పడుతున్నాయి.