: గొడ్డు మాంసంపై నఖ్వీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన ఒవైసీ
గొడ్డు మాంసం తినాలనుకుంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ ఛానెల్ డిస్కషన్ లో ఆయన మాట్లాడుతూ, పశు వధ, పశుమాంస విక్రయంపై నిషేధం విధించడం సరైనదేనని అన్నారు. ఈ వ్యవహారం లాభనష్టాల విషయం కాదని, నమ్మకాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. హిందువులకు అది అత్యంత సున్నితమైన అంశమని ఆయన తెలిపారు. 'గొడ్డు మాంసం తినాల్సిందే' అని ఎవరైనా భావిస్తే, వారు పాకిస్థాన్, అరబ్ దేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ముస్లింలు కూడా పశుమాంస భక్షణ వ్యతిరేకిస్తారని ఆయన వెల్లడించారు. అయితే, ఆయన వ్యాఖ్యలను అదే చర్చలో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దానిపై నిషేధం విధిస్తుందా? అని ప్రశ్నించారు.