: చెన్నై పోలీసులను హడలెత్తించిన మానసిక వికలాంగుడి ఫోన్ కాల్
ఓ మానసిక వికలాంగుడు చేసిన ఫోన్ కాల్ చెన్నై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ నెల 23న జయలలిత సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా, ఆ కార్యక్రమానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్వే పోలీస్ కంట్రోల్ రూంకు ఈ కాల్ రావడంతో, వారు చెన్నై పోలీసులకు వివరించారు. దీంతో, వారు రంగంలోకి దిగి, బెదిరింపు కాల్ ఓ మానసిక వికలాంగుడి పనే అని తేల్చారు. గురువారం అర్ధరాత్రి ఈ కాల్ వచ్చింది. కాగా, శనివారం జరగనున్న అమ్మ ప్రమాణ స్వీకారోత్సవానికి చెపాక్ క్యాంపస్ వేదిక కానుంది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.