: లేడీ గాగా పెళ్లి దుస్తుల కోసం ప్రముఖు డిజైనర్ల పోటీ!
పాప్ సింగర్ లేడీ గాగా వివాహం నటుడు టైలర్ కెన్నీతో జరగనున్న నేపథ్యంలో, ఆమె వివాహ దుస్తుల డిజైన్ నేను అందిస్తానంటే, నేను అందిస్తానని ప్రముఖ డిజైనర్లు 30 మంది తమ తమ స్కెచ్ లను గీసి పంపారు. ఈ డిజైనర్లు పంపిన స్కెచ్ లను చూసి లేడీ గాగా మురిసిపోతోందట. తన జీవితంలో ఎంతో స్పెషల్ డే కోసం వారంతా కష్టపడి డిజైన్లు గీసినందుకు ట్విట్టర్ ఖాతా ద్వారా కృతజ్ఞతలు కూడా చెప్పింది. "మీ అభిమానం చూసి ఆనందంతో నాకు మాటలు రావడం లేదు" అని వ్యాఖ్యానించింది. కాగా, ఈ డిజైన్లలో ఎవరు పంపిన స్కెచ్ ని తాను ఎంపిక చేసుకోనుందన్న విషయాన్ని లేడీ గాగా వెల్లడించలేదు.