: పేద ఇంజనీరింగ్ విద్యార్థిని తరిమిన మృత్యువు


అతను ఇంజనీరింగ్ విద్యను చుదువుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఖాళీ సమయాల్లో గొర్రెలను కాయక తప్పనిసరి పరిస్థితి. పొద్దున్నే గొర్రెలను తీసుకుని వెడుతున్న అతనిపైకి గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దగదర్తి మండలం దామవరం గ్రామనికి చెందిన వెంకట రమణయ్య గొర్రెల కాపరిగా పనిచేస్తూ, ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ ఉదయం రోజుమాదిరి ఒక చేత్తో పుస్తకం, మరో చేత్తో కర్ర పట్టి గొర్రెలను తోలుకుంటూ వెడుతుంటే మృత్యువు వెంటాడింది. ఏ వాహనం ఢీకొట్టిందో తెలియదుగానీ, వెంకట రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరో ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రాచర్లపాడు విషాదంతో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News